January 23, 2020

నెల్లూరులో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణి – స్వాగతం పలికిన అధికారులు

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణి శనివారం నెల్లూరుకు విచ్చేశారు. రోడ్డు మార్గం గుండా తిరుమలకు వెళుతూ మార్గమధ్యంలో ఆమె నెల్లూరులో ఆగారు. కొద్దిసేపు దర్గామిట్ట లోని ఆర్ అండ్ బి అతిథిగృహంలో బస చేశారు. ఆర్ అండ్ బి అతిధి గృహానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు, జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆమెతో కొద్దిసేపు మాట్లాడారు. గంట తర్వాత ఆమె తిరుమలకు బయలుదేరి వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!