November 22, 2019

నెల్లూరులో రైతు భరోసా సభ – జోరు వానలో సిఎం జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీ ప్రాంగణంలో రైతు భరోసా సభ కొనసాగుతుంది. విజయవాడ నుండి ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడి నుండి హెలికాప్టర్ లో నెల్లూరుకు చేరుకున్నారు. రేణిగుంట నుండి నెల్లూరు వరకూ ఆకాశం మేఘావృతమై జల్లులు పడుతున్న జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ లోనే బయలుదేరారు. హెలికాప్టర్ నెల్లూరుకు చేరుకునే సరిగా జోరు వాన మొదలైంది. జోరు వానలోనే జగన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ విక్రమ సింహపురి యూనివర్శిటీలో ల్యాండ్ అయ్యింది. జిల్లా మంత్రులు డాక్టర్ అనీల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి, ఇంఛార్జ్ మంత్రి మేకతోటి సుచరిత ఇతర ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి సిఎం జగన్ వ్యవసాయశాఖ, జలవనరులు శాఖ, ఉద్యాన శాఖ ఇతర శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. తదుపరి వేదికపై చేరుకున్న జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి అక్కడే ఉన్న స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. తదుపరి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!