November 19, 2019

ఈనెల 15న నెల్లూరుజిల్లాకు ముఖ్యమంత్రి జగన్ రాక – ఏర్పాట్లు పరిశీలించిన కాకాణి

Clock Of Nellore ( Muthukur ) – రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 15వ తేదీనా నెల్లూరుజిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ముత్తుకూరులో ఆయన పర్యటన ఖరారైంది. ముత్తుకూరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అలాగే స్థానిక ఫిషరీస్ కళాశాలలో హాస్టల్ భవనాన్ని ప్రారంభిస్తారు. మరో వైపు ముఖ్యమంత్రి రాక నేపద్యంలో ముత్తుకూరులో ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా వైసీపి అధ్యక్షులు మరియు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, నెల్లూరు రూరల్ డిఎస్పీ రాఘవరెడ్డి ఇతర అధికారులతో కలిసి ముత్తుకూరు చేరుకున్న కాకాణి ఫిషరీస్ కళాశాల హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. అలాగే ఎమ్పీడిఓ కార్యాలయం వెనుక వైపు హెలిప్యాడ్ ను పరిశీలించారు. సభ ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే దానిపై చర్చించారు. అయితే అధికారికంగా జగన్ పర్యటన ఇంకా ఖరారు కాలేదు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!