November 21, 2019

ఆయువు తీసిన వాయుడు – ఆక్వా ఫ్యాక్టరీలో అమ్మోనియా లీక్ – ఒకరు మృతి.. ఇంకొకరికి అస్వస్థత

Clock Of Nellore ( Kodavalur ) – ఆక్వా ఫ్యాక్టరీ నిర్లక్ష్యం మూలంగా ఒక ప్రాణాలు విడిచిన సంఘటన నెల్లూరుజిల్లాలో చోటుచేసుకుంది. కొడవలూరు మండలం, పెయ్యలపాళెంలో ఉన్న ఆల్ఫా మెరైన్ ఆక్వా ఫ్యాక్టరీలో గురువారం రాత్రి ప్రమాదవశాత్తూ అమ్మోనియా వాయుడు లీకయింది. ఒక్కసారిగా గ్యాస్ బయటకు రావడం, అది విషపూరితమైనది కావడంతో అక్కడున్న కార్మికులు శ్రీనివాసులు, సంజన అస్వస్థతకు గురై స్రృహ తప్పి పడిపోయారు. దీంతో తోటి కార్మికులు, యాజమాన్యం వారిని నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యులు వారికి చికిత్స అందించారు. శ్రీనివాసులు చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. సంజనకు చికిత్స కొనసాగుతుంది. మరో వైపు అమ్మోనియా లీకేజీ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, పైర్ సిబ్బంది, కార్మిక శాఖ అధికారులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. విష వాయువు ఎలా లీక్ అయింది అనే విషయాలపై ఆరాతీశారు. ప్రమాదం వెనుక యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా అనే కోణాల్లో కూడా విచారణ జరుపుతున్నారు. కొడవలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కార్మికశాఖ అధికారులు ఫ్యాక్టరీలో ఎంత మంది కార్మికులు ఉన్నారు… భద్రతా పరంగా వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనే విషయాలను పరిశీలించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!