November 19, 2019

చుక్కల భూములకు త్వరలో పరిష్కారం – మంత్రి అనీల్ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – చుక్కల భూములను సాగుచేసే వారికి తగిన విధంగా న్యాయం చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. చుక్కల భూములకు పట్టాలు ఇవ్వరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు. బడుగు, బలహీన వర్గాల వారి గురించి ప్రభుత్వానికి నివేదించి, వారంలోగా సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలోని చుక్కల భూమి వారికి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో సర్వే చేసి గడచిన 40 ఏళ్ల నుండి సాగు చేసుకుంటున్న వారికి న్యాయం చేస్తామన్నారు. అలాగే జిల్లాలో రైతులు పండించిన ఎన్.ఎల్.ఆర్ – 34449 రకం బియ్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా రెండు రోజుల్లో అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!