November 12, 2019

నెల్లూరులో అవినీతి అధికారి “సింహం” – ఏసిబి సోదాల్లో బయటపడ్డ కోట్లు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో మరో అవినీతి అధికారి ఏసిబికి చిక్కాడు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే సమాచారంతో తెలుగు గంగ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎమ్. లక్ష్మీ నరసింహం నివాసంపై ఏసిబి అధికారులు గురువారం తెల్లవారు జామున దాడులు నిర్వహించారు. నెల్లూరుతో పాటూ కావలి, ప్రకాశం జిల్లా, తూర్పుగోదావరి జిల్లా మొత్తం 6 చోట్ల ఆయనకు సంభందించిన నివాసాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించి అవినీతి సొమ్మును బయటకు తీశారు. నెల్లూరులో రెండస్తుల భవనంతో పాటూ కావలిలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నట్లు గుర్తించారు. అంతే కాకుండా వివిధ జిల్లాల్లో ఉన్న ఆస్తుల దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. బంగారు, వెండి ఆభరణాలను కూడా పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా నగదు కూడా భారీ ఎత్తున లభ్యమైనట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ మార్కెట్ ధర ప్రకారం సుమారు 20 కోట్ల పై మాటే అని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!