November 19, 2019

మిలాద్ ఉన్ నబీ సందర్బంగా అన్నదానం – ముఖ్య అతిధిగా హాజరైన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు 33వ డివిజన్ పరిధిలోని వెంగళరావు నగర్ లో బారాషహీద్ దర్గా ఛైర్మైన్ అబ్ధుల్ రజాక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, 33వ డివిజన్ వైసీపి ఇంఛార్జ్ బెజవాడ మేఘనాథ్ సింగ్ లు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని గిరిధర్ రెడ్డి ప్రారంభించి అబ్ధుల్ రజాక్ ను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సేవే పరమావధిగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించే అబ్ధుల్ రజాక్ తమ పార్టీలో ఉండటం ఆనందకరమన్నారు. గత 10 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చేస్తున్న అబ్ధుల్ రజాక్ కు అల్లా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో అజీజ్, షరీఫ్, ముజాఫర్, ముఫీద్, సమీ, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!