November 22, 2019

కోలుకునేవరకు ఆర్థికసాయం – ఇతర రాష్ట్రాల్లో కూడా ఆరోగ్య శ్రీ వర్తింపు – ప్రభుత్వ నిర్ణయం

Clock Of Nellore ( Amaravathi ) – శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి కోలుకునే వరకూ ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం అమరావతిలోని సచివాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరోగ్య శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నవంబర్‌ 1వ తేదీ నుంచి హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. 150 ఆసుపత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలందించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్‌ 1 నుంచి శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి కోలుకునే వరకు ఆర్థికసాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులతో పాటు తలసేమియా, హీమోఫిలియా, సికిల్‌సెల్‌ ఎనీమియా వ్యాధితో బాధపడుతున్న వారికి రూ.10 వేలు సాయం అందిస్తారు. పనిచేయలేని స్థితిలో ఉన్న వారికి రూ.5 వేల పింఛన్‌ వర్తిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రసూతి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని ఆసుపత్రుల్లో అభివృద్ధి పనులు 2020 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. బోధనాసుపత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా, నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డిసెంబర్‌ 1 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేయాలని సీఎం ఆదేశించారు. వైయస్‌ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని కళాశాల విద్యార్థులకు వర్తింజేయాలని తెలిపారు.వైద్యరోగ్యశాఖలో ఖాళీల భర్తీ ప్రక్రియ జనవరిలో మొదలు పెట్టాలని ఆదేశించారు.

1 thought on “కోలుకునేవరకు ఆర్థికసాయం – ఇతర రాష్ట్రాల్లో కూడా ఆరోగ్య శ్రీ వర్తింపు – ప్రభుత్వ నిర్ణయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!