November 12, 2019

ఎస్పీని ఆశ్రయించిన ప్రేమ జంట – రక్షణ కల్పించాలని వేడుకోలు

Clock Of Nellore ( Nellore ) – కుటంబసభ్యుల నుండి తమకు ప్రాణ హాని ఉందని ఓ ప్రేమ జంట నెల్లూరుజిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగిని కలిసి వినతి పత్రం సమర్పించారు. పొదలకూరు ప్రాంతానికి చెందిన ఆ ప్రేమ జంట ఇటీవల ఇంట్లో నుండి పారిపోయి వివాహం చేసుకున్నారు. అయితే యువతి కుటుంబసభ్యులు పొదలకూరు పోలీస్ స్టేషన్ లో తమ కుమార్తె కిడ్నాప్ అయిందని ఫిర్యాదు చేశారు. ఈ నేపద్యంలో ఆ ప్రేమ జంట సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా ఎస్పీని కలిసి తనను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని, ఇష్ట పూర్వకంగా వెళ్లిపోయానని వివరణ ఇచ్చింది. నాలుగేళ్లుగా తాము ప్రేమించుకుంటున్నామని పెళ్లి కూడా చేసుకున్నామని ఎస్పీకి చెప్పగా ఎస్పీ స్పందించి పొదలకూరు సిఐకు సమాచారం అందజేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!