November 19, 2019

నిండు కుండలా సోమశిల జలాశయం – 27 వేల క్యూసెక్కుల మేర నీరు విడుదల

Clock Of Nellore ( Somasila ) – నెల్లూరుజిల్లాలోని సోమశిల జలాశయం నిండు కుండను తలపిస్తుంది. అనంతపురం జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయంకు వరద ప్రవాహం పెరుగుతోంది. జలాశయ పూర్తి సామర్ధ్యం 78 TMCలు కాగా, శనివారం 74 TMC లకు చేరింది. దీంతో శనివారం ఉదయం జలవనరుల శాఖ అధికారులు పెన్నానదికి నీటిని విడుదల చేశారు. 11వ గేటు ద్వారా పెన్నాకు 27వేలా 600 క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేశారు. మరో వైపు పెన్నాకు నీటిని విడుదల చేయడంలో పెన్నా పరీవాహ ప్రాంత ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే కండలేరుకు 10వేల క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేస్తుండగా, సోమశిల ఉత్తర కాలవ ద్వారా 700 క్యూసెక్కులు, దక్షిణ కాలువ ద్వారా 350 క్యూసెక్కుల నీరు వెళుతుంది. ఇప్పటి వరకూ సోమశిల జలాశయంలో 74 TMCల నీటి నిల్వ లేదని ఇదే మొదటి సారి అని అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!