November 21, 2019

వార్డు కార్యదర్శులకు మొదలైన 2వ విడత శిక్షణ – పరిశీలించిన కమీషనర్ మూర్తి

Clock Of Nellore ( Nellore ) – వార్డు సచివాలయ కార్యదర్శులుగా నూతనంగా నియమితులైన అభ్యర్థులకు అందిస్తున్న శిక్షణ చాలా వ్యయంతో కూడిందని, శిక్షణ సమయంలో బాధ్యతగా వ్యవహరించి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అభ్యర్థులకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ పివివిస్ మూర్తి సూచించారు. కొడవలూరు మండలం, రామన్న పాలెం సమీపంలోని ఆదిశంకరా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న రెండవ విడత శిక్షణా తరగతులను కమీషనర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శిక్షణా ప్రాంగణంలో అన్ని వసతులను ఏర్పాటు చేసామని, 6 రోజుల పాటు అభ్యర్థులు శిక్షణకు హాజరయ్యేలా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. స్వచ్ఛమైన మంచినీరు, నాణ్యమైన భోజనం, సౌకర్యవంతమైన విశ్రాంతి గదులను కేటాయించి నిష్ణాతులైన బోధనా సిబ్బందితో వివిధ విభాగాల్లో శిక్షణ అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఎమర్జెన్సీ వైద్య సేవలను సైతం సంసిద్ధం చేసామని, శిక్షణా కాలం పూర్తయేవరకు అభ్యర్థులు తప్పనిసరిగా ప్రాంగణంలోనే ఉండాలని కమిషనర్ ఆదేశించారు. అభ్యర్థులంతా ఉత్తమ శిక్షణ పొంది, విధి నిర్వహణలో ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. శిక్షణా కాలంలో అభ్యర్థులంతా క్రమశిక్షణగా మెలుగుతూ బోధకుల నుంచి సమగ్ర సమాచారాన్ని పొందాలని సూచించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!