November 19, 2019

వెంకటగిరి జాతరలో ఏరులై పారిన మద్యం – ఘర్షణలు, ప్రమాదాల్లో 18 మందికి గాయాలు

Clock Of Nellore ( Venkatagiri ) – నెల్లూరుజిల్లా వెంకటగిరిలో పోలేరమ్మ జాతర గురువారం ఘనంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ జాతరలో మద్యాన్ని కట్టడి చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎంత ప్రయత్నించినప్పటికీ అది పూర్తి స్థాయిలో వీలు పడలేదు. ఫలితంగా మద్యం మత్తులో పలు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అంతే కాకుండా మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ ముగ్గురు ప్రమాదాల బారిన పడి తీవ్రంగా గాయపడ్డారు. వెంకటగిరి పట్టణంలో రెండు చోట్ల ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో సుమారు 15 మంది గాయపడగా వారిని స్థానిక ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు. అలాగే మూడు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రెండు చోట్ల మోటార్ సైకిళ్లు, ఓ చోట కారు ప్రమాదానికి గురి కాగా ఆయా ప్రమాదాల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని తిరుపతి రూయాకు తరలించారు. వీటిపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!