నెల్లూరు జేసీ వినోద్ కుమార్ బదిలీ… ఆయన స్థానంలో జేసీ – 2 కు పూర్తి బాధ్యతలు

0
74

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయన్ను ఏపి హెల్త్ సిస్టమ్ స్ట్రెంక్తింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో జాయింట్ కలెక్టర్ – 2 గా ఉన్న ప్రభాకర్ రెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించారు. తక్షణం ఈ ఉత్తర్వులు అమల్లో కొస్తాయని నీలం సాహ్ని పేర్కొన్నారు. 2015 బ్యాచ్ కు చెందిన వినోద్ కుమార్ అనంతపురంజిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా, రంపచోడవం సబ్ కలెక్టర్ గా, పార్వతీపురం ఐటిడిఏ ప్రాజెక్టు డైరెక్టర్ గా పనిచేస్తూ గత ఏడాది సెప్టెంబర్ నెలలో నెల్లూరుజిల్లాకు జాయింట్ కలెక్టర్ గా బదిలీపై వచ్చారు. ఏడాది కూడా పూర్తి కాకుండానే ఆయన జిల్లా నుండి బదిలీ అయ్యారు. మరో వైపు రాజకీయ కారణాలే ఈయన బదిలీకి కారణమని తెలుస్తోంది. సోమవారం సాయంత్రం అమరావతిలో జిల్లా ప్రజాప్రతినిధులు సమావేశం జరిగిన పక్క రోజే బదీలీ ఉత్తర్వులు రావడం దానికి బలాన్ని చేకూరుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here